![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:23 PM
విజయవంతమైన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. పార్ట్ 1కు ఉన్న క్రేజ్‌తో 'మ్యాడ్ స్క్వేర్'కు మంచి బజ్ వచ్చింది. దీంతో పాటు విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్ అనే అంచనాలు ఆడియన్స్‌లో ఉన్నాయి. ఇక థియేటర్‌లోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందా? ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయ్యిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
కథ: లడ్డూ (విష్ణు) తన స్నేహితుల ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న దామోదర్ (సంగీత్ శోభన్), అశోక్ కుమార్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్)లు లడ్డూ ఇంటికి చేరుకుంటారు. అయితే అనుకోకుండా పెళ్లికూతురు మరో యువకుడితో పారిపోవడంతో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. దీంతో లడ్డూ ఆ బాధ నుంచి తేరుకోవడానికి స్నేహితులందరూ గోవా ట్రిప్‌కు వెళతారు. ఆ సమయంలోనే గోవాలో ఓ విలువైన లాకెట్ దొంగతనం జరుగుతుంది. అనుకోకుండా అది ఈ స్నేహితుల చేతికి వస్తుంది. దీంతో అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటారు? వీళ్ల కోసం మ్యాక్స్ (సునీల్), శుభలేఖ సుధాకర్‌లు కూడా అన్వేషిస్తుంటారు? ఇక అసలు జరిగిందేమిటి? వీళ్లు ఈ సమస్యను ఎలా బయటపడ్డారు? అనేది చిత్ర కథ
Latest News