![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:20 PM
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ తన యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఇంట్వర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదువుకునే రోజుల్లోనే తాను మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చానని... అప్పుడు తనకు సినిమాల గురించి పెద్దగా తెలియదని చెప్పింది. సౌత్ సినిమా గురించి అస్సలు తెలియదని వెల్లడించింది. కాలేజ్ లో చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్నప్పుడు తన ఫొటోలు చూసి కన్నడ సినీ పరిశ్రమ నుంచి తొలి అవకాశం వచ్చిందని రకుల్ తెలిపింది. దక్షిణాది చిత్రాల గురించి తనకు ఏమీ తెలియకపోవడంతో చాలా ఆలోచించానని... వాళ్లు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటంతో 'గిల్లి' సినిమాలో నటించానని వెల్లడించింది. తన తొలి సినిమాతోనే యాక్టింగ్ అంటే తనకు ఎంతో నచ్చేసిందని... చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగాలని డిసైడ్ అయ్యానని తెలిపింది.తొలి సినిమా విడుదల తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని... ఆయన తనను 70 రోజుల డేట్స్ అడిగారని... తాను నో చెప్పానని వెల్లడించింది. సినిమాలపై అవగాహన లేక చాలా చిత్రాలను వదులుకున్నానని తెలిపింది. తన అభిప్రాయాలు, జాకీ అభిప్రాయాలు కలిశాయని... దీంతో ఇద్దరం ఒక్కటయ్యామని... ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని చెప్పింది.
Latest News