![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 04:10 PM
ధమాకా: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ధమాకా' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మార్చి 30న మధ్యాహ్నం 1 గంటకు స్టార్ మా ఛానల్ లో ప్రదర్శించబడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ధమాకా చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, రావు రమేష్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు.
డీజే టిల్లు: విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు థియేటర్లలో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మార్చి 30న మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ మా ఛానల్ లో ప్రదర్శించబడుతుంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్, ప్రగతి, బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Latest News