![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:50 AM
డీప్ ఫేక్ సాంకేతికతను దుర్వినియోగం చేయడం పట్ల ప్రముఖ నటీమణి, బీజేపీ ఎంపీ హేమమాలిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతుండడం పట్ల ఆమె పార్లమెంటులో గళం విప్పారు. ఈ అంశంపై లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ, డీప్‌ఫేక్ టెక్నాలజీ సెలబ్రిటీల ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. కృత్రిమ మేధస్సు, డీప్‌ఫేక్ టెక్నాలజీ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న ఈ సమయంలో, దీని దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని హేమమాలిని సూచించారు. ఈ టెక్నాలజీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ, కొందరు సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వారి వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం బాధాకరమని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Latest News