![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:06 PM
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎల్2 : ఎంపురాన్' సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలిపినట్లు చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్ చేశామని నిర్మాత పేర్కొన్నారు.భారతదేశంతో సహా ఉపఖండంలో జరుగుతున్న మారణహోమం మధ్య హిందువులను విలన్లుగా చిత్రీకరించే హిందూ వ్యతిరేక ప్రచార చిత్రం ఎంపురాన్ అంటూ మండిపడింది. బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి పీ సుధీర్ మాట్లాడుతూ ఈ మూవీ తన దారిలో వెళ్తుందని.. పార్టీ సైతం తన పని తాను చేసుకుంటుందన్నారు. ఈ సినిమాతోనూ పార్టీ ప్రభావితం కాదని.. సంఘ్‌కు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే హక్కు ఉందని.. అది మంచి చిత్రమా? లేదా? అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని పేర్కొంది. కేరళ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కుట్టతిల్ మూవీకి మద్దతు ప్రకటించారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి నిరాధారమైన అబద్ధాలు, మతపరమైన ద్వేషాలతో కూడిన చిత్రాలకు భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించే వ్యక్తులు ఇప్పుడు ఎంపురాన్‌ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
Latest News