![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 02:01 PM
జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన సినీ నటుడు నాగబాబు బుధవారం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ.. ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో కింద 'ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC)గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, అశీస్సులతో.. అన్నయ్య వదిన' అంటూ రాసుకొచ్చారు.శాసన మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాగబాబు.. తన అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు నాగబాబును పూల మాలతో సత్కరించారు.అంతే కాకుండా ఖరీదైన పెన్నును కానుకగా అందించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన..తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు. మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు.. మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకం. నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్ ఉపయోగించడం గౌరవంగా భావించా అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News