![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 02:46 PM
మారుతీ నగర్ సుబ్రమణ్యం: లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్ నటించిన 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 6న ఉదయం 9 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్తిగా వినోదభరితమైన కామెడీ డ్రామాగా పేర్కొనబడిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు.
హనుమాన్: ప్రశాంత్ వర్మ యొక్క సూపర్ హీరో యాక్షన్ చిత్రం "హనుమాన్" 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి గా నిలిచింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 250 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ఏప్రిల్ 6న మధ్యాహ్నం 2:30 గంటలకి ప్రదర్శించటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జ ప్రేమికురాలిగా అమృత అయ్యర్ నటించగా, అతని సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ విఎఫ్‌ఎక్స్ భారీ చిత్రాన్ని నిర్మించారు.
కల్కి 2898 AD: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన అతని ఇటీవలి బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' భారీ అంచనాల మధ్య విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిష్టించింది. సైన్స్ ఫిక్షన్ ఎపిక్ దాని గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా సెట్ చేయబడింది. కల్కి 2898 AD ఏప్రిల్ 6, 2025న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది. దీపికా పదుకొనే, కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ పౌరాణిక వైజ్ఞానిక కల్పన వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు వసూలు చేసింది. రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, శాశ్వత ఛటర్జీ, బ్రహ్మానందం, అన్నా బెన్, శోభన, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మెగా-బ్లాక్‌బస్టర్‌కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Latest News