![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:43 AM
విజయాల పరంపర కొనసాగిస్తున్న తాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనే చేయొచ్చు, అయితే పరాజయాలు ఎదుర్కొంటున్న దర్శకులతోనూ నటించానని హీరో నాని అన్నారు. కథ నచ్చితే చాలు, మిగతా విషయాలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.హీరోగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని, ప్రస్తుతం కథానాయకుడిగా హిట్ 3, ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన కోర్ట్ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల గురించి మాట్లాడారు. కథల ఎంపిక విషయంలో తన నిర్ణయాలు చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారని అన్నారు. కథల ఎంపికకు ప్రత్యేకంగా ఫార్ములా ఏమీ లేదని, ప్రేక్షకుల కోణంలోంచి చూస్తానని తెలిపారు. తాను నిర్మించిన కోర్ట్ మూవీని థియేటర్‌లో చూడటానికి ఎవరూ రారని, ఇది ఓటీటీ సినిమా అని చాలామంది అన్నారని గుర్తు చేశారు.చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఎవరు వస్తారని చాలామంది ప్రశ్నించారని, తన కార్యాలయంలో పనిచేసేవారు సైతం సందేహాలు వ్యక్తం చేశారని నాని అన్నారు. అయితే ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసిన వెంటనే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు.
Latest News