![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 11:05 AM
నటుడు అజిత్ కుమార్ తన కుమారుడు అద్విక్‌కు రేసింగ్ పాఠాలు నేర్పుతూ కనిపించారు. అంతర్జాతీయ కార్ రేసింగ్‌లో పాల్గొని తిరిగి వచ్చిన అనంతరం, చెన్నైలోని ఓ గో కార్ట్ సర్క్యూట్‌లో అద్విక్‌కు స్వయంగా రేసింగ్ మెళుకువలు నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయ్, యూరప్‌లో జరిగిన రేసింగ్‌లో పాల్గొన్న అనంతరం చెన్నైకి వచ్చిన అజిత్, నేరుగా నగరంలోని ఎంఐకేఏ గో కార్ట్ సర్క్యూట్‌కు వెళ్లారు. అక్కడ తన కుమారుడు అద్విక్‌కు రేసింగ్ గురించి వివరిస్తూ, పలు సూచనలు చేశారు. అజిత్ స్వయంగా డెమో ఇస్తూ, అద్విక్‌కు రేసింగ్ టెక్నిక్స్ నేర్పించారు.అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ తమ ఎక్స్ ఖాతాలో ఈ వీడియోలను, ఫోటోలను పంచుకుంది. అజిత్, ఆయన భార్య, కుమారుడు చెన్నైలోని ఎంఐకేఏ గో కార్ట్ సర్క్యూట్‌కు వచ్చినప్పుడు తీసిన చిత్రాలను పోస్ట్ చేశారు. "వేగం యొక్క అవసరాన్ని గ్రహించిన అజిత్ అండ్ ఫ్యామిలీ! స్వచ్ఛమైన రేసింగ్ పట్ల వారికున్న మక్కువను ఇది చూపిస్తుంది. ఎంఐకేఏ (మద్రాస్ ఇంటర్నేషనల్ కార్టింగ్ ఎరీనా), ఎంఐసీ (మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్)లకు ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.వీడియోలో అజిత్ తన కుమారుడు డ్రైవర్ సీటులో కూర్చున్నప్పుడు మోకాళ్లపై కూర్చుని రేసింగ్ గురించి ఓపికగా వివరిస్తూ కనిపించారు. రేస్ ట్రాక్‌పై అద్విక్ వేగంగా దూసుకుపోతున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు అజిత్‌ను, ఆయన తనయుడిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Latest News