![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:59 PM
అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల ముద్దుల తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక అందమైన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "అత్యంత ముద్దుగా ఉండే అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. విశాల హృదయం, చురుకైన పాదాలు కలిగిన మా చిన్ని భోజన ప్రియుడు నువ్వు. కుటుంబ యాత్రను ప్లాన్ చేస్తున్నపుడయినా, భోజనం చేస్తున్నప్పుడయినా మా అందరినీ నవ్విస్తావు. మమ్మల్ని కలిపి ఉంచే మాయాజాలం నీవే. పెద్ద కలలు కనడం కొనసాగించు. నీలాంటి అద్భుతమైన అబ్బాయిని మేము పొందినందుకు చాలా గర్వపడుతున్నాము" అంటూ స్నేహారెడ్డి ఈ అందమైన వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు అల్లు అయాన్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News