![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:02 PM
కొంతకాలం క్రితం వరకూ కోర్టు రూమ్ డ్రామాతో కూడిన కంటెంట్ ను చూడటానికి ప్రేక్షకులు బోర్ ఫీలయ్యేవారు. కానీ ఈ తరహా కంటెంట్ ను ఇంట్రెస్టింగ్ గా అందిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే విషయాన్ని ఈ మధ్య వచ్చిన 'కోర్ట్' సినిమా నిరూపించింది. అలాంటి ఒక కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన మరో సినిమానే 'ఉద్వేగం'. క్రితం ఏడాది నవంబర్లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: నగరం శివార్లలో ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారం జరుపుతారు. తీవ్రమైన గాయాలతో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. అత్యాచారానికి పాల్పడిన నరేశ్ .. పవన్ .. తేజసాయి అనే ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడతారు. సంపత్ అనే యువకుడు మాత్రం తప్పించుకుంటాడు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. ఎక్కడ చూసిన ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర (త్రిగుణ్) క్రిమినల్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజున అతను ఆఫీసులో ఉండగా ఒక యువకుడు అక్కడికి పరుగెత్తుకు వస్తాడు. గ్యాంగ్ రేప్ కేసులో నాల్గొవ నిందితుడు అతనే అని మహేంద్రకి అప్పుడే తెలుస్తుంది. అంతలో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంటారు. సంపత్ గ్రాండ్ మదర్ వచ్చి, అతనికి ఏ పాపమూ తెలియదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఆవేదనలో మహేంద్రకి నిజాయితీ కనిపిస్తుంది. అప్పుడు మహేంద్ర ఆ యువకుడి తరఫున వాదించాలని నిర్ణయించుకుంటాడు. అయితే బయట నుంచి అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. చివరికి మహేంద్ర ఎంగేజ్ మెంట్ కూడా రద్దవుతుంది. అయినా సంపత్ ను నమ్మి అతను ఈ కేసులో ముందుకు వెళతాడు. ఫలితంగా అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? సంపత్ ను ఆయన రక్షించగలుగుతాడా లేదా? అనేది మిగతా కథ.
Latest News