![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:17 PM
హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రావడంపై భారీ అంచనాలు ఉన్నాయి మరియు ఉస్తాద్ భగత్ సింగ్ అతని కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా భావిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన "తేరి"కి రీమేక్ అయిన "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ 20% మాత్రమే పూర్తయింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరధ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.
Latest News