![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 04:01 PM
మిల్కీ బ్యూటీ తమన్నా ... ఐటమ్ సాంగ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అనే సెంటిమెంట్ దేశ వ్యాప్తంగా నెలకొంది. తమన్నా ఏ భాషా చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసినా... అది హిట్ కావడం గ్యారంటీ. రజనీకాంత్ 'జైలర్'లోనూ, 'స్త్రీ -2'సినిమాల్లోనూ తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ ఆ మూవీ సక్సెస్ రేంజ్ ను పెంచేశాయి. దాంతో ఆమెతో ఒక్క సాంగ్ అయినా చేయించాలనే తాపత్రయం నిర్మాతలలో పెరిగిపోయింది.తాజాగా తమన్నా భాటియా ఓ హిందీ సినిమాలో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిపోయింది. అయితే... దీనిని ప్రమోషనల్ సాంగ్ గా మేకర్స్ ఉపయోగించుకో బోతున్నారు. అజయ్ దేవగన్ సరసన గతంలో 'హిమ్మత్ వాలా' హిందీ రీమేక్ లో నటించింది తమన్నా. మళ్ళీ ఇప్పుడు అజయ్ దేవ్ గన్ తాజా చిత్రం 'రైడ్ -2'లో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఈ పాటలో తమన్నాతో పాటు యో యో హనీసింగ్ కూడా నర్తించబోతున్నాడు. అలానే 'స్త్రీ -2' మూవీలోని తమన్నా ఐటమ్ సాంగ్ 'ఆజ్ కీ రాత్' కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విజయ్ గంగూలీ దీనికి డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇదే వారంలో రెండు రోజుల పాటు ముంబై స్టూడియో దీని చిత్రీకరణ జరుగబోతోంది. 'రైడ్ -2' మూవీలో అజయ్ దేవ్ గన్ ఐ.ఆర్.ఎస్. అధికారి అమయ్ పట్నాయక్ గా నటించాడు. 2018లో వచ్చిన 'రైడ్' సినిమానే ఆ మధ్య రవితేజ 'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేశాడు. ఇప్పుడీ 'రైడ్ -2' మే 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ పొలిటీషియన్ గా ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. వాణీ కపూర్, సౌరబ్ శుక్లా, యశ్ పాల్ శర్మ, సుప్రియా పాఠక్, రజత్ కపూర్ ఇతర కీలక పాత్రలను చేశారు. రాజ్ కుమార్ గుప్తా ఈ మూవీకి డైరెక్టర్.తమన్నా తెలుగులో కీలక పాత్ర పోషించిన 'ఓదెల -2' (Odela -2)చిత్రం ఏప్రిల్ 17న జనం ముందుకు రాబోతోంది. 'రైడ్ -2' మే 1న విడుదల అవుతోంది. సో... రెండు వారాల గ్యాప్ లోనే తమన్నా నటించిన రెండు సినిమాలు జనాలను అలరించబోతున్నాయి.
Latest News