![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:14 AM
మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' మూవీలో ఓ సీన్ ఉంది. జాతీయ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పే కేరళ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె... తన నిర్ణయం కారణంగా కేంద్రం తనపై ఈడీ తో కేసులు పెట్టించే అవకాశం ఉందని చెబుతుంది. ఒక వేళ తనను అధికారులు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేస్తే తనకు మద్దత్తుగా నిలవమని పార్టీ నాయకలును కోరుతుంది. చెప్పినట్టుగానే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ ను రాజకీయ ప్రయోజనాలకు ఆమె ఉపయోగించుకుంటుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే... ఈడీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఇవాళ ప్రతిపక్షానికి చెందిన చాలామంది చేసే ఆరోపణ.చిత్రం ఏమంటే... సరిగ్గా 'ఎంపురాన్' సినిమా నిర్మాత గోకులం గోపాలన్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాపై పలు వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మోహన్ లాల్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. చిత్ర రచయిత దీనిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకున్నాడు. చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పెదవి విప్పలేదు కానీ అతని తరఫున తల్లి పత్రికా ప్రకటన ఇస్తూ... తన కొడుకును బలి పశువును చేస్తున్నారని, చిత్ర నిర్మాతలకు, మోహన్ లాల్ కు అన్నీ ముందే తెలుసు అని స్పష్టం చేసింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ, చిత్ర బృందమే సినిమాను రీ-సెన్సార్ కు పంపింది. టైటిల్ కార్డ్స్ లో ఉన్న బీజేపీ ఎంపీ సురేష్ గోపీ పేరును తొలగించింది. కొన్ని వివాదాస్పద అంశాలను మూడు నిమిషాల పాటు ఎడిట్ చేసింది. కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేసింది. ఆ తర్వాత మరోసారి సినిమాను జనంలోకి తీసుకొచ్చింది. అయితే సినిమాలో చూపించిన మాదిరిగానే కేంద్రం 'ఎంపురాన్' మేకర్స్ పై కక్ష కట్టిందని కొందరు ఆరోపిస్తున్నారు.
Latest News