![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 05:38 PM
డీనో డెన్నిస్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బాజూకా' అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, నీతా పిళ్ళై, బాబు ఆంటోనీ, ఐశవార్య మీనన్, గాయత్రీ అయ్యర్ మరియు దివ్య పిళ్ళై మరియు షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో సహాయక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటుడు బెంజిమిన్ జాషువ అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. నిమిష్ రవి మరియు రాబి వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. సయీద్ అబ్బాస్ ఈ చిత్రానికి సంగీతాన్ని స్వరపరిచారు. యోడులే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి మాజీ ఆర్మీ అధికారి మరియు ట్రావెల్ జంకీగా వినీత్ మీనన్‌గా కనిపించనున్నారు.
Latest News