![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 10:28 AM
సుహాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవికా మనోజ్ కథానాయికగా పరిచయమవుతున్నారు. రామ్ దర్శకత్వంలో హరీశ్ నల్ల నిర్మించారు. నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. గురువారం చిత్రబృందం టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘ఎలాగుండే వాణ్నే ఎలా అయిపోయానే’ అంటూ హీరోయిన్ ప్రేమ కోసం హీరో పడే ఇబ్బందులను వివరిస్తూ సాగే ఈ గీతానికి శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించారు. రథన్ స్వరకల్పనలో శరత్ సంతోష్ ఆలపించారు. ప్రేక్షక హృదయాలను దోచుకొనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నిర్మాత చెప్పారు. సినిమాలోని ఆరుపాటలు ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని దర్శకుడు చెప్పారు.
Latest News