![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 12:23 PM
అదితి రావు హైదరి, ఒక భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాం గవర్నరుగా పనిచేసిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ, హైదరాబాద్కు చెందిన జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి ఎహ్‌సాన్ హైదరీ, హైదరాబాదు రాజ్యానికి దివానుగా పనిచేసిన అక్బర్ హైదరీ, అస్సాం గవర్నరుగా పనిచేసిన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీల రాజ కుటుంబంలో జన్మించాడు వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించిన ఆమెకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.రోటిన్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస ల్లో నటిస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇటీవలే టాలీవుడ్ సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. మహా సముద్రం లో సిద్దార్థ్, అదితి రావు హైదరీ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.2006లో ప్రజాపతి తో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది అదితి. ఇందులో మమ్ముట్టి సరసన నటించింది. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. హిందీలో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మావాత్ వంటి చిత్రాల్లో నటించింది.ఇక తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం వంటి ల్లో నటించింది. టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా హిట్స్ పడలేదు. అదితి భరతనాట్య కళాకారిణి. హీరామండి లో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.హీరామండి తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదని.. లు లేక ఖాళీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 1978 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది అదితి.