![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 02:32 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది, పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నాటికి తన బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. షూటింగ్‌ను ముగించడానికి పవన్ ఇప్పటికే డేట్స్ కూడా కేటాయించాడు. ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఈ వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను దూకుడుగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Latest News