![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 11:57 AM
శ్రీరామనవమి సందర్భంగా అమితాబ్ బచ్చన్ రామకథను వినిపించబోతున్నారు. ఓటీటీ వేదిక డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రామాయణంలోని ఏడు కాండాలను ప్రేక్షకులకు వివరించనున్నారు. ఈ లైవ్ స్ట్రీమ్‌లో అయోధ్య, భద్రాచలం, పంచవటి, చిత్రకూట్ వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లోని పూజా కార్యక్రమాలను, వేడుకలను ప్రసారం చేస్తున్నారు. అలాగే కైలాష్ కేర్, మాలినీ అవస్థీ, పాలక్ ముచ్చల్ వంటి గాయకులు తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ లైవ్‌స్ట్రీమ్ ప్రసారం కానుంది.
Latest News