![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:55 PM
తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఎప్పుడు ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు దినేష్ తేజ్, దష్విక హీరో, హీరోయిన్లుగా నటించిన తత్వం మూవీ విడుదలకు సిద్దమైంది. కాగా ఈ మూవీకి అర్జున్ కోల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.దర్శకుడు మాట్లాడుతూ ” మా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా ధన్యవాదాలు. పెళ్లి చూపుల కోసమని ఓ గ్రామానికి వెళ్లిన హీరో, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ పరిణామాల మధ్యలో అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఉంటుంది’ అన్నారు.
Latest News