![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 09:36 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ షాట్ పేరిట రేపు ఓ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఆ గ్లింప్స్ వీడియోను తాను చూశానని తాజాగా హీరో రామ్ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ శాంపిల్ మ్యూజిక్ బిట్ ను పంచుకున్నారు. 'పెద్ది పెద్ది' అంటూ సాగే ఈ బిట్ కిర్రాక్ పుట్టించేలా ఉంది. దీనిపై రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. "పెద్ది గ్లింప్స్ చూశాక అమితమైన సంతోషం కలిగింది. ఏఆర్ రెహమాన్ సర్ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... మామూలుగా లేదు... అదరహో అనేలా ఉంది. ఈ గ్లింప్స్ ను మీరు (అభిమానులు) తప్పకుండా ఇష్టపడతారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ (గ్లింప్స్) వస్తోంది" అంటూ రామ్ చరణ్ పోస్ట్ చేశారు.
Latest News