![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 06:37 PM
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ఇమాన్వి ఎస్మాయిల్ టాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. తాత్కాలికంగా ఫౌజీ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం యుద్ధ ఆధారిత పీరియాడికల్ లవ్ డ్రామా అని మేకర్స్ వెల్లడించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన పీరియాడికల్ డ్రామా. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా రొమాంటిక్ కథాంశంలో నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలో నటిస్తున్నారు. 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 350 కోట్ల బడ్జెట్‌తో గ్రాండ్ రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్‌ట్రాక్ అందించనున్నారు.
Latest News