![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:43 AM
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’ నిత్యామేనన్ కథానాయిక. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ ధనుష్ పోస్టర్ పంచుకున్నారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అక్టోబర్ 1న రిలీజ్ కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అరుణ్ విజయ్, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా వాయిదా పడనుందంటూ వార్తలు రాగా నిర్మాత ఖండించారు. అనుకున్న సమయానికే సినిమాను తీసుకొస్తామని తెలిపారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
Latest News