![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:48 PM
హిందీలో రూపొందిన 'చోరీ' సినిమా, 2021 నవంబర్లో థియేటర్లకు వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాను పేక్షకులు మరిచిపోలేదు. టేకింగ్ పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. నుష్రత్ బరూచా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. అలాంటి ఈ సినిమా నుంచి ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఒక యువతి గర్భవతిగా ఉంటుంది. దెయ్యాల బారి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేసే ప్రయత్నంగా 'చోరీ 1' కథ సాగుతుంది. ఆమెకి బిడ్డ పుట్టిన తరువాత అదే దెయ్యాల నుంచి ప్రమాదం ఎదురవుతుంది. అప్పుడు ఆమె ఆ బిడ్డను రక్షించుకోవడం కోసం ఏం చేస్తుంది? అనేది 'చోరీ 2'లో చూపించనున్నారు. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా ట్రైలర్ ను వదిలారు. జానపదానికి దగ్గరగా అనిపించే కథ ఇది. ఒక వైపున రాజులు .. రాజ్యాలను గురించిన ప్రస్తావన చేస్తూ, మరో వైపున మూఢనమ్మకాలు .. దెయ్యాలతో ముడిపడిన కథ ఇది. ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచగలిగింది. సోహా అలీఖాన్ .. సౌరభ్ గోయల్ .. హార్దిక శర్మ .. పల్లవి అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Latest News