![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:39 AM
సెలబ్రిటీలకి అభిమానులు ఉండటం సహజం. వాళ్ల అభిమానానికి హద్దులు ఉండవు. కొందరు గుడి కట్టి పూజిస్తే, మరికొందరు టాటూలు వేయించుకుంటారు. ఇంకొందరు తమ అభిమాన నటుల పేరు మీద ఏదైనా సహాయ కార్యక్రమాలు చేస్తారు. కానీ, ఒక అభిమాని మాత్రం తన అభిమాన నటి అదా శర్మ కోసం ఏకంగా తన రక్తంతోనే బొమ్మ గీసి దిగ్భ్రాంతికి గురిచేశాడు.అదా శర్మ నటించిన 'సన్‌ఫ్లవర్ 2' వెబ్ సిరీస్‌లో రోజీ పాత్రతో ఆ అభిమాని ఎంతగానో ప్రభావితమయ్యాడట. ఆ పాత్రలోని అదా శర్మను చూసి స్ఫూర్తి పొందిన ఆ అభిమాని, ఆమె బొమ్మను తన రక్తంతో గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయం తెలిసిన అదా శర్మ ఆశ్చర్యానికి గురైంది."నా పాత్రలను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 1920 చిత్రం నుంచి కేరళ స్టోరీ, కమాండో, సన్‌ఫ్లవర్ వరకు నా పాత్రలను అభిమానిస్తున్నారు. అభిమానులు చూపే ఈ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. రోజీ పాత్ర చాలా వింతగా ఉంటుంది. నిజ జీవితంలో నేను రక్తాన్ని ఇష్టపడను, కాబట్టి దయచేసి ఇలాంటి చిత్రాలు వేయకండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, మరొక అభిమాని 'బస్తర్ స్టోరీ' సినిమాలోని అదా శర్మ చిత్రాన్ని తన గోటిపై వేయగా, ఇంకొకరు బియ్యంతో ఆమె చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా అదా మాట్లాడుతూ, "సృజనాత్మకత అద్భుతంగా ఉంది!" అని తెలిపింది.
Latest News