![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 11:44 AM
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కూతురు దేవసేన శోభా మొదటి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మేము ముగ్గురం నలుగురం అయ్యాం అంటూ మనోజ్ భార్య మౌనిక రెడ్డి, పిల్లలతో కలిసి ఉన్న క్యూట్ ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఓ చక్కటి క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. "మా ప్రపంచం మరింత మాయజాలంగా మారింది. మేము ముగ్గురం నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు.. నాలుగు ఆత్మలు. ఒక అచంచలమైన బంధమిది. ప్రేమ, బలం శాశ్వతంగా నిర్మించిన కుటుంబం ఇది. దేవసేన శోభా మా పులి. తను మా జీవితాల్లోకి కాంతి, ధైర్యం, అనంతమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. అమ్మ, నేను, అన్నయ్య ధైరవ్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి రక్షిస్తాం. అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. మేము నిన్ను మాటలకు అందనంతగా ప్రేమిస్తున్నాం. దేవసేనకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ మనోజ్ రాసుకొచ్చారు.
Latest News