![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:38 AM
నవీన్ చంద్ర హీరోగా నటించిన '28 డిగ్రీస్ సెల్సియస్' మూవీ ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకు వచ్చింది. 'పొలిమేర' ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆయనకు డెబ్యూ ప్రాజెక్ట్. కరోనా కారణంగా విడుదలకు నోచుకోని '28 డిగ్రీస్ సెల్సియస్' సినిమాను మొత్తానికీ విడుదల చేశారు. విశేషం ఏప్రిల్ 4న ఈ సినిమా విడుదలైతే, నవీన్ చంద్ర సోలో హీరోగా నటించిన మరో మూవీ 'లెవెన్' మే 16న రిలీజ్ కాబోతోంది.'లెవెన్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. సుందర్ సి శిష్యుడు లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన 'లెవెన్' అనే ఈ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో శ్రుతీహాసన్, ఆండ్రియా జెరెమియా పాటలు పాడటం విశేషం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. గతంలో 'సిల నెరంగళఙల్ సిలి మణిధర్గళ్' చిత్రంలో నటించిన రేయా హరి ఇందులో హీరోయిన్ గా చేసింది. అభిరామి, దిలీపన్, రిత్విక, శశాంక్, 'ఆడుకాలం' నరేన్, రవివర్మ, అర్జై, కిరీటీ దామరాజు కీలక పాత్రలు పోషించారు. పలు బాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫీ అందించగా, నేషనల్ అవార్డ్ గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి. ఎడిటర్. మరి రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవన్'కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
Latest News