![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:47 PM
అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ నేడు 11వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కుమారుడి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ, "నా జీవితంలో వెలుగులు నింపిన అయాన్ కు జన్మదిన శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయాన్ చిన్ననాటి జ్ఞాపకాలను ఒక వీడియో రూపంలో షేర్ చేస్తూ, "మా అల్లారు ముద్దుబిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అయాన్, అర్హ ఇంట్లోనే బర్త్ డే వేడుక జరుపుకున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను స్నేహారెడ్డి అభిమానులతో పంచుకున్నారు. అయాన్ పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా కుటుంబ సభ్యులందరూ చుట్టూ చేరి సందడి చేశారు.అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్. దీనితో ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఊహాగానాలు మొదలయ్యాయి. వెనుకవైపు నుంచి మాత్రమే కనిపించడంతో, ఆయన తన కొత్త లుక్ ను రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నట్టుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Latest News