![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 09:40 AM
తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి, ఆయన అత్త మహేశ్వరిపై దాడి చేసిన ఘటనలో తమిళ నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్ -3 ద్వారా నటుడు దర్శన్ పేరు తెచ్చుకున్నాడు. శ్రీలంకు చెందిన దర్శన్ ‘గూగుల్ కట్టప్ప’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. చెన్నైలోని ముగప్పేర్‌లో ఉంటున్న దర్శన్ ఇంటి ముందు టీ దుకాణం ఉంది. అక్కడ టీ తాగేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు దర్శన్ ఇంటి ముందు కారు పార్క్ చేశారు. దీంతో అక్కడి నుంచి కారును తీయాలని దర్శన్ కోరాడు. ఈ క్రమంలో కారు పార్క్ చేసిన ఆత్తిచుడి, దర్శన్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అది మరింత ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. గాయపడిన ఆత్తిచుడి, మహేశ్వరి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్, ఆయన సోదరుడు లోకేశ్‌లను అరెస్ట్ చేశారు. అలాగే, దర్శన్ ఫిర్యాదుతో ఆత్తిచుడి, ఆయన భార్య, అత్త పైనా కేసు నమోదైంది.
Latest News