![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:49 PM
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తిగా లేరని, బడ్జెట్ ఎక్కువ కావడంతో సినిమా ఆగిపోయిందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ తీవ్రస్థాయిలో స్పందించింది. ఇవన్నీ పుకార్లేనంటూ ఖండించింది. సినిమా నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయని, ఎటువంటి ఆటంకాలు లేవని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవాళ్లు తమ దృష్టిలో జోకర్లని పేర్కొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో 'దసరా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభపై నమ్మకంతో ఉన్నామని, 'ది ప్యారడైజ్' చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest News