![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:20 PM
బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ కూడా మనోజ్ కుమార్ మృతిపై స్పందించారు. ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో మనోజ్ కుమార్‌ది ప్రత్యేక స్థానమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Latest News