![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:16 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక కూడా అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. "అల్లు అర్జున్ సర్... ఇది మీ పుట్టినరోజు... వేడుకలు చేసుకునే సమయం... నాకు తెలిసి మీరు ఓ రేంజిలో సెలబ్రేట్ చేసుకుని ఉంటారు... అత్యుత్తమంగా ఆస్వాదించి ఉంటారు... ఇది మీకు హ్యాపియెస్ట్ బర్త్ డే కావాలని కోరుకుంటున్నాను... మీకు నా ప్రేమాభిమానాలు" అంటూ రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ఇక విజయ్ దేవరకొండ తాను ఎంతో అభిమానించే అల్లు అర్జున్ కోసం స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేశారు. "బన్నీ అన్నా... నీకు హ్యాపీ హ్యాపీ బర్త్ డే. మరింత భారీ విజయాలు సాధించాలని కోరుకుంటూ నా నుంచి నీకు ఆత్మీయ ఆలింగనాలు, ప్రేమాభిమానాలు" అని విజయ్ పేర్కొన్నారు.
Latest News