సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 07:19 PM
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పీఎస్ లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేసేందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Latest News