![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 07:05 AM
రామ్ గోపాల్ వర్మ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయన మూలకథను అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. వర్మ శిష్యుడు గిరి కృష్ణ కమల్ దీనిని డైరెక్ట్ చేశాడు. ఓ మలయాళ భామ చీరకట్టులో ఉన్న రీల్స్ చూసి... టెంప్ట్ అయిన వర్మ ఆమెతో ఈ 'శారీ' మూవీ తీశాడు. చిత్రం ఏమంటే... తన చిత్రాల ద్వారా సందేశాలను ఇవ్వడానికి అస్సలు ఇష్టపడి ఆర్జీవీ ఈ సినిమాతో మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, దాని కారణంగా జరిగే కీడును గుర్తెరగాలని చెప్పే ప్రయత్నం చేశాడు.
కథ: వర్మ సినిమాలు అంటే గతంలో కాస్తంత కథ, ఆసక్తిని కలిగించే కథనం ఉండేవి. ఆయన మేకింగ్ స్టైల్ కు ఇన్ స్పైర్ అయిన కుర్రాళ్ళు చాలామంది దర్శకులుగానూ మారారు. అయితే కొన్నేళ్ళుగా వర్మ కథను తీసి పక్కన పడేసి... తన మనసులోని భావాలను సీన్ వైజ్ పేర్చుకుంటూ పోతున్నారు. 'శారీ' కూడా ఆ కేటగిరికి చెందిన మూవీనే. నిజం చెప్పాలంటే... ఇందులో అసలు చెప్పుకోదగ్గ కధే లేదు! చీరకట్టుకోవడం అంటే ఇష్టమైన ఆరాధ్య (ఆరాధ్య దేవి) అనే అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళినా శారీలోనే వెళుతుంది. ఒకానొక సమయంలో అందమైన చీరలో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు (సత్య యాదు) ఆమెతో ప్రేమలో పడతాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, ఆమెతో ఫోటో షూట్ చేస్తానని చెబుతాడు. ఆరాధ్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇష్టపడని ఆమె అన్నయ్య రాజ్ (సాహిల్ సంభవాల్) తరచూ హెచ్చరిస్తూ ఉంటాడు. కిట్టు కోరిక మేరకు ఆరాధ్య ఫోటో షూట్ కు అంగీకరిస్తుంది. అయితే కిట్టు చూపుల్లోని కామాన్ని గమనించిన రాజ్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. తనకు ఆరాధ్యకు మధ్య రాజ్ అడ్డుగా నిలబడడాన్ని కిట్టు తట్టుకోలేకపోతాడు. సైకోగా మారిపోయి.... రాజ్ ను హతమార్చాలనుకుంటాడు. ఆరాధ్య కోసం పిచ్చివాడిగా మారిపోయిన కిట్టు ఏం చేశాడు? అతని విపరీత ధోరణికి ఆరాధ్య అట్టుకట్ట వేయగలిందా? అందంగా చీర కట్టుకోవాలనే తన కోరిక కారణంగా ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
Latest News