![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 04:33 PM
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల-2’. పిడియాట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్, ఆడియో హక్కుల రూపంలో రూ.18 కోట్లు రాగా తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రూ.10 కోట్లు వచ్చాయి. ఈ మూవీ బడ్జెట్ రూ.25 కోట్లు కాగా రిలీజ్‌కు ముందే రూ.3 కోట్లు లాభాలు వచ్చేశాయి.ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సీక్వెల్‍గా క్రేజ్ ఉండడం, సంపత్ నంది బ్రాండ్ కావటం, తమన్నా లీడ్ రోల్ కావడంతో ఈ చిత్రానికి హైప్ బాగానే ఉంది. అందుకు తగ్గట్టే అంచనాలకు మించి బిజినెస్ చేసింది. ఈ మూవీకి అశోక్ తేజ డైరెక్షన్ చేయగా.. దర్శకత్వ పర్యవేక్షణతో పాటు నిర్మాతగానూ వ్యవహించారు సంపత్ నంది.
Latest News