|
|
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 02:39 PM
సినీనటి రేణూదేశాయ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. “రాజకీయాల్లోకి వెళ్లడమనేది నా జాతకంలోనే ఉంది. గతంలో ఓ ఛాన్స్ వచ్చింది. కేవలం పిల్లల పెంపకం కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నా. ఇప్పటికీ అదే అభిప్రాయం. నేను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా" అని పేర్కొన్నారు. పాలిటిక్స్ అంటే ఇష్టమేనా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'సామాజికసేవ చేయడంలోనే నాకు 'ఆనందం' అని తెలిపింది.అకిరా పెద్ద వాడు అయిపోయాడని, ఆద్యకి ఇంకో మూడు నాలుగేళ్లు అయితే 18 ఏళ్లు వస్తాయ్ అని ఆ తరువాత తన గురించి ఆలోచించుకుంటానని తాజాగా రెండో పెళ్లి మీద రేణూ దేశాయ్ స్పందించారు. ఎన్నో సందర్భాల్లో తనకంటూ ఓ వ్యక్తి ఉండాలని, తనకంటూ బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనిపించేదట. కానీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం అది తనకు తప్పుగా అనిపించేదట.
Latest News