![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:21 PM
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో సంయుక్త మరియు సాక్షి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ దర్శనమే అనే టైటిల్ తో విడుదల చేసారు. విశాల్ చంద్రశేఖర్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, యజిం నిజార్ తన గాత్రాణి అందించారు. ఈ పాటను కళాశాల క్యాంపస్‌లో చిత్రీకరించారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్‌ట్రాక్ అందించనున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు. షూటింగ్పూ ర్తి కావడంతో, ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News