|
|
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:14 PM
మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. భారీ అంచనాల సీక్వెల్ ఒదెల-2లో ప్రేక్షకులను ఆకర్షించడానికి నటి సిద్ధంగా ఉంది. 2021 OTT బ్లాక్‌బస్టర్ ఒడెలా రైల్వే స్టేషన్‌ను అనుసరించడానికి అశోక్ తేజ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. సౌందర్‌రాజన్ విజువల్స్ క్యాప్చర్ చేయడం మరియు రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్షన్‌ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదలకి సిద్ధంగా ఉంది.
Latest News