|
|
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 04:33 PM
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు నమోదైంది. మత ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నాడని ఆరోపిస్తూ, సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర పోస్ట్‌లు చేశారని ఆయనపై గతంలో కేసులు నమోదు అయ్యాయి.
Latest News