![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 05:40 PM
ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా "సీతా పయనం" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో నిరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. కన్నడలో ప్రాథమికంగా చిత్రీకరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో నిరంజన్ కి జోడిగా ఐశ్వర్య అర్జున్ నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ఆన్ బోర్డులో ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జ ఉన్నట్లు ప్రకటించారు. నటుడి ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మేకర్స్ ఈ చిత్రంలో నటుడు పవన్ అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్, రైటర్ గా సాయి మాధవ్, చంద్ర బోస్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Latest News