![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 02:59 PM
అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు 'పుష్ప 2' టీవీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 'పుష్ప 2' ఏప్రిల్ 13న టీవీలో టెలికాస్ట్ కానుంది. టీవీలో టెలికాస్ట్ కావడం ఇదే తొలిసారి కాబట్టి పుష్ప 2 మూవీ రికార్డు టీఆర్పీలను సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 'పుష్ప 2' గత డిసెంబర్‌లో ఒకేసారి వివిధ భాషల్లో రిలీజైంది. ఇప్పుడు టీవీ లో కూడా ఒకే రోజున వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఏప్రిల్ 13న, 'పుష్ప 2' తెలుగుతో పాటు కన్నడ, తమిళం తదితర భాషల్లో వివిధ ఛానెళ్లలో ప్రసారం కానుంది. 'పుష్ప 2' ఓటీటీలో విడుదలైనప్పుడు ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఇప్పుడు అదేవిధంగా, 'పుష్ప 2' టీవీ ప్రీమియర్ కోసం తెలుగులో ప్రత్యేక ప్రకటనలు నిర్మించి ప్రసారం చేస్తున్నారు.
'పుష్ప 2' తెలుగులో స్టార్ మాలో ప్రసారం కానుంది. ఏప్రిల్ 13 (ఆదివారం)న సాయంత్రం 5 గంటలకు ఈ మూవీని టెలికాస్ట్ చేయనున్నట్లు ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తోంది. 'పుష్ప 2' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.
Latest News