![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 03:03 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తన వెంట అకీరా నందన్‌ను పెట్టుకుని అన్ని ప్రదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అకీరా అందరికీ దగ్గరయ్యారు. అయితే అకీరాకు చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అకీరా మీసాలు, ఎర్ర టీ షర్ట్‌తో చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా ఎంట్రీ ఉంటుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కానీ అకీరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అకీరా లుక్ ఛేంజ్ చేసేశాడు. మొన్నటి వరకు తండ్రి లాగానే లాంగ్ హెయిర్, మీసాలు, గడ్డంతో కనిపించాడు. తాజాగా రేణూ దేశాయ్ చేసిన పోస్టులో గడ్డం తీసేసి కోరమీసాలతో కనిపిస్తున్నాడు. ఎక్కడకో ట్రిప్ కు వెళ్లగా అక్కడ దిగిన ఫొటోను రేణూ ఇలా పోస్టు చేసింది.
Latest News