|
|
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:35 PM
రీసెంట్ గా మెగా కుటుంబం ఇంట చిన్న పాటి కలవరం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను చదువుకుంటున్న సింగపూర్ స్కూల్ లో అగ్ని ప్రమాదానికి గురి కావడంతో వారి ఇంట సహా అభిమానుల్లో కూడా కలవరం నెలకొంది.దీనితో చాలా మంది నటీనటులు సహా ప్రధాని మోడీ కూడా పవన్ పట్ల మార్క్ పట్ల తమ సానుభూతి వ్యక్తం చేశారు. ఇలా లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా స్పందించడం అభిమానుల్లో వైరల్ గా మారింది. అయితే లేటెస్ట్ గా దీనికి పవన్ నుంచి స్పందన వెనక్కి వచ్చింది. తారక్ నుంచి వచ్చిన మాటలకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ ఈ సమయంలో తనకోసం నిలబడినందుకు సంతోషం వ్యక్తం చేశారు.అంతే కాకుండా తన లిటిల్ వన్ (మార్క్ శంకర్) కోలుకుంటున్నాడు అంటూ తారక్ చెప్పిన రీతిలోనే సమాధానం ఇచ్చి అభిమానులకి కొద్దిపాటి ఉపశమనం కలిగించారు. దీనితో తారక్ కి ఇచ్చిన సమాధానం ఇపుడు వైరల్ గా మారింది.
Latest News