![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:57 PM
హీరోయిన్ హెబ్బా పటేల్ నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా అశోక్ తేజ తెరకెక్కించారు. తమన్నా భాటియా ముఖ్య పాత్ర పోషించారు. దర్శకుడు సంపత్ నంది సమర్పణలో మధు నిర్మించారు. ఈనెల 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు హెబ్బా పటేల్.‘‘ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. మొదటి భాగం చేసేటప్పుడు ఆ సినిమా ఘన విజయం సాధిస్తుందని.. దానికి సీక్వెల్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఒక నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. అశోక్‌తేజకు మంచి విజన్‌తో పాటు అపారమైన ప్రతిభ ఉంది. తమన్నా ఇందులో నా సోదరి పాత్రలో కనిపిస్తారు. శక్తిమంతమైన నాగసాధువు పాత్రలో ఆమె నటన సినిమాకే ప్రధానాకర్షణగా ఉంటుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతినిస్తుంది’’ అని చెప్పారు.
Latest News