![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 12:20 PM
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండేళ్ల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది పాప జన్మించింది.. తమ కూతురికి దేవసేన శోభా MM అని నామకరణం చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.దేవసేన జన్మించిన నేటికి ఏడాది. ఈరోజు (ఏప్రిల్ 3న) దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో తన కూతురి గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తన కూతురి క్యూట్ ఫోటోస్ షేర్ చేశారు మంచు మనోజ్. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు మంచు మనోజ్."సంవత్సరం క్రితం మా ప్రపంచం మరింత అద్భుతంగా తయారైంది. ముగ్గురం నలుగురు అయ్యాము. నాలుగు పిల్లర్లు, అందమైన ఫ్యామిలీ. దేవసేన శోభా నువ్వు మా జీవితంలోకి వెలుతురు, ధైర్యం, సంతోషాన్ని తీసుకొచ్చావు. అమ్మ, నేను ధైరవ్ నిన్ను కాపాడుకుంటాం. నీకు లైఫ్ లో అంతా బెస్ట్ ఉండాలి. మంచి జీవితాన్ని సృష్టించుకుందాం. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పలేనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.మరోవైపు మంచు లక్ష్మి సైతం దేవసేనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్యూ వీడియో షేర్ చేసింది. "నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. పని కూడా ఉంది. కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన. నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను. రోజంతా నీతోనే గడిపాను. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్. నన్ను అత్తగా సెలక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ. నిన్ను త్వరలో కిడ్నప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా. ఈ డైమండ్ ను నాకు ఇచ్చినందుకు మనోజ్, మౌనికకు థాంక్యూ" అంటూ రాసుకొచ్చింది.
Latest News