![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 11:02 AM
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటన చేసింది.ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు.ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుండటంతో కల్యాణ్ రామ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.విజయశాంతి ఈ చిత్రంలో వైజయంతి ఐపీఎస్ అనే పాత్రను పోషించడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతం లో విజయశాంతి నటించిన సూపర్ హిట్ చిత్రం కర్తవ్యంలో ఆమె పోషించిన పాత్ర పేరు కూడా వైజయంతి ఐపీఎస్ కావడం విశేషం.అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతితో పాటు సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News