![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:33 AM
తమిళంలో జై హీరోగా ఒక సినిమా రూపొందింది. కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన ఆ సినిమా పేరే 'బేబీ అండ్ బేబీ'. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, థియేటర్ల వైపు నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత 'సన్ నెక్ట్స్' ఓటీటీకి వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' తమిళ ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది. జై జోడీగా ఈ సినిమాలో ప్రజ్ఞా నగ్రా కనిపించనుంది. ఈ బ్యూటీ 'లగ్గం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తమిళంలో ఆమె చేసిన మూడో సినిమా ఇది. యువరాజ్ నిర్మించిన ఈ సినిమాకి ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సత్యరాజ్, యోగిబాబు, ఇళవరసు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ కథ రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. రెండు జంటలకు ఒకే సమయంలో బిడ్డలు కలుగుతారు. ఊహించని విధంగా శిశువులు తారుమారు అవుతారు. ఆ జంట బిడ్డ వీరి దగ్గరికీ... ఈ జంట బిడ్డ వారి చేతుల్లోకి వెళతారు. అప్పటి నుంచి ఆ రెండు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.
Latest News