![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:41 AM
మెగాస్టార్ 157 చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘మెగా 157’ పేరు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. మెగా 157 సినిమాకు పనిచేస్తున్న కీలకమైన వ్యక్తులతో మెగాస్టార్ ఇంటరాక్ట్ అయినట్లు చూపుతూ ఈ వీడియోను ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. చిరంజీవి నటించిన సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న వర్క్‌ను వివరించడం ఈ వీడియోలో కనిపించింది. ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ మెగాస్టార్ చెప్పిన నేపథ్యంలో 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసేందుకు చిత్ర బృందం పనిచేస్తున్నట్లు సమాచారం.
Latest News