![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:57 AM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంజాన్ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్లి ఈద్ వేడుకల్లో చెర్రీ పాల్గొన్నారు. వీడియోలో చరణ్ కి ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలకడం, ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఉంది. వారి వంటకాలని ఆయన ఇష్టంగా ఆరగించడం మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో ఊరమాస్ లుక్‌లో చెర్రీ అదిరిపోయాడు. రామ్ చరణ్ రగ్డ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News