మ్యాడ్ స్క్వేర్ డే4 కలెక్షన్లు..
by Suryaa Desk |
Tue, Apr 01, 2025, 03:25 PM
లేటెస్ట్ గా మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ కామెడి ఎంటర్టైనర్ అంచనాలు అందుకొని అదరగొట్టింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా గట్టి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు కేవలం 4 రోజుల్లోనే చాలా చోట్ల బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా నిర్మాత నాగ వంశీ చెబుతున్నారు. అలాగే మరికొన్ని చోట్ల ఆల్రెడీ 90 శాతం టార్గెట్ కూడా రీచ్ అయ్యిపోయిందట.దీనితో మ్యాడ్ స్క్వేర్ పట్ల తాను ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సినిమా టికెట్ ధరలపై కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ సినిమాలు పోటీ కారణంగా ధరలు పెంచాల్సి వచ్చింది అని నేటి నుంచి సాధారణ ధరకే టికెట్స్ ఉంటాయని తాను కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమాకి ఏపీలో మరింత బెటర్ పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.4 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మ్యాడ్ స్క్వేర్
సాధించిన రికవరీ 130 శాతం పైనే ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
Latest News